‘ఉత్తమ విలన్’ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న సి.కళ్యాణ్
‘దశావతారం’,
‘విశ్వరూపం’ వంటి విభిన్న చిత్రాలతో సంచలనం సృష్టించిన జాతీయ నటుడు
కమల్‌హాసన్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఉత్తమ విలన్’. ఈ చిత్రం ప్రారంభమైన
రోజు నుంచే చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్
ఏర్పడిరది. ఈ చిత్రం తెలుగు రైట్స్‌ని ప్రముఖ నిర్మాత,
సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ అధినేత సి.కళ్యాణ్ సొంతం
చేసుకున్నారు. ఇటీవల చంద్రకళ, పిశాచి వంటి అనువాద చిత్రాలను తెలుగులో
విడుదల చేసి వరసగా రెండు సూపర్‌హిట్స్ సాధించిన సి.కళ్యాణ్ ‘ఉత్తమ
విలన్’ తెలుగు రైట్స్ కూడా సొంతం చేసుకోవడం విశేషం. ఈ చిత్రం తెలుగు
రైట్స్ కోసం విపరీతమైన పోటీ వున్నప్పటికీ ఫ్యాన్సీ ఆఫర్‌తో తెలుగు హక్కులు
పొందారు సి.కళ్యాణ్.
ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో ‘ఉత్తమ విలన్’ విడుదల
ఈ
చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది.
తిరుపతి బ్రదర్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ సమర్పణలో
సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ‘ఉత్తమ విలన్’
చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సి.కళ్యాణ్. ఏప్రిల్ 10న
తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు
చేస్తున్నారు.
కమల్‌హాసన్, జయరామ్, కె.బాలచందర్, నాజర్,
ఆండ్రియా, పూజా కుమార్, పార్వతి మీనన్, పార్వతి నాయర్ తదితరులు
ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు:
కమల్‌హాసన్, సంగీతం: ఎం.గిబ్రాన్, సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్,
ఎడిటింగ్: విజయశంకర్, సమర్పణ: తిరుపతి బ్రదర్స్, ఈరోస్ ఇంటర్నేషనల్,
కో`ప్రొడ్యూసర్: సి.వి.రావు, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: రమేష్
అరవింద్.
No comments:
Post a Comment